| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలి

News

Posted on 2026-03-30 17:54:51

Share: Share


కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలి

మహిళలకు 2500/- హామీని వెంటనే అమలు చేయాలి 

వివాహ సమయంలో తులం బంగారం ఇవ్వాలి

విద్యార్ధినీలకు స్కూటీలు పంపిణీ  చేయాలి 

హమీల అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి.

ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత.

వైరా రూరల్ అధ్యక్షురాలు బాణాల వెంకట్రావమ్మ.

డైలీ భారత్, వైరా: మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మహిళలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని, హామీల అమలు కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, మండల అధ్యక్షురాలు బాణాల వెంకట్రావమ్మ అన్నారు. వైరా మండలం అష్టగుర్తి గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) గ్రామ కమిటీని 19 మంది సభ్యులతో ఎన్నుకున్నారు. ఐద్వా అష్ణగుర్తి గ్రామం అధ్యక్షురాలుగా మోదుగు లక్మి, కార్యదర్శిగా కంచర్ల రమాదేవి, ఉపాధ్యక్షురాలుగా కంచర్ల అనూష, సహాయ కార్యదర్శిగా నారపోగు జమలమ్మ, కంచర్ల స్రవంతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత, బాణాల వెంకట్రావమ్మ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో మహిళలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గడిచిన రెండున్నరేండ్లుగా వాటిని అమలు చేయకుండా మహిళలను మోసం చేసిందని, బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఇంకా మహిళలను మభ్యపెట్టాలని చూస్తున్నదని విమర్శించారు. వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని మహిళలను నమ్మించి ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ.2500, పెళ్లి సమయంలో తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హామీలిచ్చి బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా కాంగ్రెస్‌ మహిళలను మోసగించిందని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ఐద్వా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అష్ణగుర్తి సర్పంచ్ కంచర్ల అనిత, 9వ వార్డు మెంబర్ కంచర్ల వెంకటమ్మ, ఐద్వా గ్రామ కమిటీ సభ్యులు కంచర్ల మరియమ్మ, కంచర్ల బుల్లెమ్మ, కంచర్ల లక్ష్మి, కంచర్ల సునీత, కంచర్ల జయమ్మ, పెద్దప్రోలు చిన్న వెంకమ్మ, ఆదిమళ్ళ రమణ, మోదుగు దుర్గ, మోదుగు లలిత, గంధం బాగ్యమ్మ, గంధం శ్రావణి, ఆదిమళ్ళ వసంత, కారుమంచి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >