Posted on 2026-03-30 18:21:22
జిల్లాలోని కేజీబీవీలు, టీజీఎంఎస్ రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్లకు 20 ఫ్రీజర్ల పంపిణీ
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లాలోని జిల్లాలోని 13 కేజీబీవీలు, ఏడు టీజీఎంఎస్ హాస్టళ్లకు కలిపి 20 ఫ్రీజర్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక చొరవతో సమకూర్చారు.
ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఆయా విద్యాలయాల బాధ్యులకు కలెక్టర్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తుందని వివరించారు. *ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో* భాగంగా జిల్లాలోని విద్యాలయాల విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, సేవలు అందిస్తుందని తెలిపారు. జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్లకు గత చలికాలంలో విద్యార్థులకు వేడి నీళ్లు అందించేందుకు ఇప్పటికే గీజర్లు అందించామని గుర్తు చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించేందుకు ఫ్రీజర్లు ఈరోజు ఆయా రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్ల బాధ్యులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఫ్రీజర్ల ద్వారా విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు, కూరగాయలు పాడైపోకుండా నిల్వ చేసుకోవచ్చనీ, పాలు, ఆకు కూరలు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు స్వచ్ఛంగా అందించే అవకాశం ఉందని తెలిపారు. రెసిడెన్షియల్ విద్యాలయాల్లో శుభ్రమైన ఆహారం పదార్థాలు అందించడం, వ్యర్థాల నిర్వహణ, వసతి గృహాలలో మెరుగైన జీవన వాతావరణం కల్పించడానికి ఇన్సినరేటర్, వంటపాత్రలు కూడా గతంలో అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జీసీడీవో పద్మజ, స్పెషల్ ఆఫీసర్స్, కేర్ టేకర్స్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >