Posted on 2026-03-30 19:04:38
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో సోమవారం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( టీజీవోస్ ) 2026 సంవత్సరపు నూతన డైరీ మరియు క్యాలెండర్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతలో టీజీవోల పాత్ర అభినందనీయమని కొనియాడారు. నూతన డైరీ మరియు క్యాలెండర్ ఉద్యోగులకు సమాచార వారధిగా ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్ బాధ్యులు డాక్టర్ కె. కిష్టయ్య మాట్లాడుతూ.. అధ్యాపకులు అకడమిక్ మరియు పరిపాలన పరమైన అంశాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజీవోస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆర్. దేవేందర్, జిల్లా సెక్రెటరీ బి. సాయి రెడ్డి, జిల్లా బాధ్యులు కె. రాజలింగం, ఎస్. భూమయ్య, ఎండి. తురబుద్దిన్, డాక్టర్ సుధాకర్, సంఘ సభ్యులు ఎన్. రాములు, అంకం జయప్రకాష్, శ్రీమతి శ్రీవల్లి, డాక్టర్ గణేష్, డాక్టర్ దినకర్, డాక్టర్ జి. శ్రీనివాసరావు, రాజశ్రీ, రాజ్ గంభీరావు, చంద్రశేఖర్ గౌడ్, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >