Posted on 2026-03-31 11:45:48
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.
డైలీ భారత్, వరంగల్: చదువుకునే పిల్లల్లో ఆనందాన్ని చూడొచ్చుని వరంగల్ సీపీ తెలిపారు. సోమవారం ఫోర్ట్ వరంగల్ మండలంలోని గుంటూరు పల్లి మండల ప్రాథమిక పాఠశాల యందు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరియు ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటుక బట్టీలలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలకు కమిషనర్ గారి చేతుల మీదుగా ఎడ్యుకేషనల్ సామాగ్రి మరియు యూనిఫార్మ్స్ పంపిణీ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనేది పోలీసు మరియు వివిధ ప్రభుత్వ అధికారుల సమన్వయంతో జరుగుతుందని ఆ యొక్క కార్యక్రమంలోనే భాగంగా స్కూలు బయట ఉన్న పిల్లలందరినీ గుర్తించి తప్పనిసరిగా స్కూల్లో చేర్పించాల్సిన అవకాశం ఉందని తెలిపారు అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కొరకు ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కుటుంబాలలోని పిల్లలకు సరైన విద్యా అవకాశాలు లేకుండా ఉన్న 120 బాలలను గుర్తించి వారిని అందర్నీ పాఠశాలల్లో చేర్పించడం జరిగింది. ఈ పిల్లలకు సరైన విద్య అందుటకు కు ప్రత్యేకమైన టీచర్స్ ను మరియు యూనిఫాం, బుక్స్ బ్యాగులు, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ సహకారంతో ఇప్పించడం జరుగుతుందని ఇందుకుగాను నేను పోలీసు విభాగాన్ని ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగాన్ని మరియు ఎఫ్ఎం సాంఘిక సేవా సంస్థ వారిని అభినందిస్తున్నాను అన్నారు.
అంతేకాకుండా హాజరైన పిల్లలతో ముఖాముఖి నిర్వహించి మీరు ఏం చదువుతున్నారు ఎటువంటి లక్ష్యాలను మీరు సాధిస్తారు అని చెప్పి పిల్లలతో మాట్లాడడం జరిగింది తద్వారా పిల్లలను మరియు సభ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలకు రక్షణ, భద్రతతో పాటు వారికి విద్య అందించడం అనేది చట్టప్రకారం ముఖ్యమని కావున సరైన విద్యను అందించినప్పుడే పిల్లల మొహంలో చిరునవ్వును చూడొచ్చని సూచించారు ఈ యొక్క కార్యక్రమంలో హాజరైన వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ మాట్లాడుతూ పిల్లల రక్షణ సంరక్షణ విషయంలో అందరం సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో నందు అడిషనల్ డీసీపీ N. రవి మాట్లాడుతూ ఇటుక బట్టీలో ఓనర్లు గాని ఇతరులు గాని ఎవరైనా పిల్లల్ని పనిలో పెట్టుకున్నట్లైతే జీవనల్ జస్టిస్ యాక్టివ్ మరియు ఇతర చట్టాల ప్రకారం శిక్ష పడుతుందని సూచించారు కావున ఇటు కాబట్టి ఇలా ఓనర్లు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించుటకు సహకరించాలని సూచించారు ఈ యొక్క కార్యక్రమంలో మామునూరు ఏసిపి వెంకటేష్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ J.శ్యాంసుందర్, S.I సుధాకర్ గుంటూరు పల్లి సర్పంచి శ్రీకాంత్, ఉపసర్పంచి దండ నరేష్ ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, ప్రాజెక్టు కోఆర్డినేటర్లు బత్తుల కరుణ ,ఎర్ర శ్రీకాంత్, కుమ్మరి రవికుమార్, IJM రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆనంద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ, డిసిపిఓ ఉమా షేర్ ఎన్జీవో కోఆర్డినేటర్ శిరీష దితరులతో పాటు గ్రామ పెద్దలు మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హాజరైన 120 మంది పిల్లలకు ఎడ్యుకేషన్ KITS, యూనిఫామ్ ఇతర సామాగ్రిని అందించడం జరిగింది.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >