| Daily భారత్
Logo




కోటి రూపాయల విలువైన హషీష్ ఆయిల్ స్వాధీనం – ఒకరి అరెస్ట్

News

Posted on 2026-03-31 11:53:01

Share: Share


కోటి రూపాయల విలువైన హషీష్ ఆయిల్ స్వాధీనం – ఒకరి అరెస్ట్

డైలీ భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) బృందం సమిష్టిగా నిర్వహించిన తనిఖీలలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 9.402 కిలోల హషీష్ ఆయిల్ (గంజాయి ద్వారా తయారు చేసే నూనె)ను పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 1 కోటిగా అంచనా వేశారు.

A-1: కొరాబు చాంటి బాబు (35 సంవత్సరాలు) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా నివాసి (అరెస్ట్)

A-2: రాజారావు (ఒరిస్సా) – పరారీలో ఉన్నారు

A-3: గుర్తుతెలియని వ్యక్తి – పరారీలో ఉన్నారు

పోలీసుల వివరాల ప్రకారం, A-1 చంటి బాబు, A-2 రాజారావు వద్ద నుండి ఈ డ్రగ్స్‌ను సేకరించి హైదరాబాద్‌లోని గుర్తుతెలియని వ్యక్తులకు సరఫరా చేయడానికి ప్రయత్నించాడు. మార్చి 29 సాయంత్రం మహేశ్వరం గేట్ బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్న సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 10 పాలిథిన్ కవర్లలో ఉన్న హషీష్ ఆయిల్ మరియు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు చంటి బాబుపై గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని కంచరపాలెం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలలో 4 NDPS కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

యువత మరియు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు సూచించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని కోరారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే మహేశ్వరం జోనల్ కంట్రోల్: 8712662664 లేదా Dial 100కు సమాచారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన అధికారులను పోలీస్ కమిషనర్ శ్రీ జి. సుధీర్ బాబు, ఐపిఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >