| Daily భారత్
Logo




మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-03-31 11:28:48

Share: Share


మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

మహాలక్ష్మి పథకంతో ఆర్థిక స్వావలంబన

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్రంలో 10 వేల కోట్లు మహిళలు చార్జీలు ఆదా చేసిన సందర్భంగా వేడుకలు

పలువురు మహిళలకు ఉచిత బస్సు టికెట్ అందించిన కలెక్టర్

ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న  మహిళలకు బహుమతుల అందజేత.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేండ్లకు పైగా పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, రూ.10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగించుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి  ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. పలు ప్రభుత్వ పథకాలు మహిళల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వారి పేరిట ఇస్తున్నామని వివరించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని తెలిపారు. చీరలు మన సంస్కృతికి నిదర్శనమని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతు పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. స్కూల్ యూనిఫాం వారితో కుట్టించామని పేర్కొన్నారు. సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని వెల్లడించారు. బ్యాంక్ లింకేజ్ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు.


ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డీఎంలు ప్రకాశరావు, శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 15:47:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 15:46:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 15:20:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 15:19:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 15:14:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 15:11:31

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

Posted On 2026-04-10 15:09:34

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

Posted On 2026-04-10 12:50:34

Readmore >
Image 1

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

Posted On 2026-04-10 11:44:44

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య

Posted On 2026-04-10 11:41:43

Readmore >