| Daily భారత్
Logo




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో నాకాబందీ

News

Posted on 2026-04-05 11:44:30

Share: Share


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో నాకాబందీ

జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా నాకాబందీ కార్యక్రమం ద్వారా ప్రత్యేక తనిఖీలు: ఎస్పీ రోహిత్ రాజు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో నాకాబంది కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు ఈ నాకాబందీ కార్యక్రమం ద్వారా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు.జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ప్రతిష్టమైన ప్రణాళికతో వాహన తనిఖీలు,డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను కనుగొనడానికి ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం,రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టడం,పాత నేరస్తులను కనిపెట్టే విధంగా ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా ప్రతి ఒక్కరి వేలిముద్రలను తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు.ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ, వన్ టౌన్ సిఐ కరుణాకర్ , ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >