Posted on 2026-04-05 16:30:43
ఆన్‌లైన్ ఆటల వ్యసనమే దొంగతనానికి కారణం
సీసీ కెమెరాల సాక్షిగా దొరికిపోయిన గొలుసు దొంగ
కత్తితో బెదిరించి దోచుకున్న నిందితుడు అరెస్ట్ – బంగారు గొలుసు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డిఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: తేది 02-04-2026 ఉదయం సుమారు 4:00 గంటల సమయంలో, బాణాల అనసూయ అనే మహిళ తన ఇంటి ముందు పనులు చేస్తుండగా, ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె మెడలోని సుమారు 3 తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
ఈ కేసులో జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డిఎస్పీ ఎస్. శ్రీనివాస రావు గారి పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు సదాశివనగర్ సి.ఐ బి. సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్.ఐ వై. నరేష్ మరియు CCS ఎస్.ఐ ఉస్మాన్ బృందాలను తయారుచేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలోని CCTV ఫుటేజీలను మరియు ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి, నిందితుడు అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డిగా గుర్తించి, ఈరోజు క్రిష్ణాజివాడి బస్‌స్టాండ్ వద్ద గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి నిందితుని విచారించగా, నిందితుడు జల్సాలు, ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైనాడు. నిందితుడు పక్క ప్లాన్ ప్రకారం గొలుసు దొంగతనం చేయాలని నిర్ణయించుకొని దొంగతనం చేసినాడు అని విచారణలో తేలింది.
నిందితుని వివరాలు:
బాణాల తిరుపతి రెడ్డి S/o గోపాల్ రెడ్డి , తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామానికి చెందినవాడు.
నిందితుని వద్ద నుండి స్వాధీనం పరచుకున్నవి:
1. సుమారు 30 గ్రాముల బరువు గల రెండు వరుసల బంగారు పుస్తల తాడు (రెండు ముక్కలు).
2. నేరానికి ఉపయోగించిన కత్తి మరియు ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్.
3. నిందితుడు ధరించిన దుస్తులు: రెడ్ కలర్ టీ-షర్ట్, లైట్ గ్రే కలర్ షర్ట్, ప్యాంట్ మరియు నేర సమయంలో ధరించిన నలుపు స్కార్ఫ్.
ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వంటి వ్యసనాలు యువతను అప్పుల ఊబిలోకి నెట్టి, చివరికి వారిని నేరస్థులుగా మారుస్తున్నాయి. క్షణికమైన ఆశ కోసం అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చడానికి దొంగతనాలు వంటి దారి తప్పే పనులు చేస్తూ తమ ఉజ్వల భవిష్యత్తును జైలు పాలు చేసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. కేవలం యువత మాత్రమే కాకుండా, పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల వ్యవహార శైలిని, వారి ఖర్చులను మరియు ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించడం తమ బాధ్యత అని పోలీసులు తెలిపారు.
కేసును అత్యంత వేగంగా ఛేదించిన సదాశివనగర్ సి.ఐ సంతోష్ కుమార్, ఎస్.ఐ లు నరేష్, ఉస్మాన్ మరియు కానిస్టేబుళ్లు ఇర్ఫాన్, సమ్రాట్, దేవిచంద్, శ్రీకాంత్, గణపతి, మైసయ్య, రవి (CCS)లను జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర ఐపిఎస్ అభినందించారని ఎల్లారెడ్డి డిఎస్పీ ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >