Posted on 2026-04-05 18:59:40
ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందిన సీఎండీ.
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని టీజీఎన్పీడీసియల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి ఆదివారం భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎండీకి అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో వేద పండితులు వేదోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందజేయగా, సీఎండీ వినయంతో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి (ఏఈఓ) జి. శ్రవణ్ కుమార్ స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
ఈ పుణ్యక్షేత్ర దర్శనం ద్వారా ప ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం వేడుకున్నట్లు సీఎండీ తెలిపారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >