Posted on 2026-04-05 21:15:37
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డా. బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లోని భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, డా. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించి, సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలకు మంత్రిగా సేవలందించడమే కాకుండా, దేశ ఉప ప్రధానిగా కూడా సమర్థవంతంగా పనిచేసి ప్రజాసేవకు అంకితభావంతో నిలిచారని తెలిపారు.
మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో వివక్ష లేకుండా సమానత్వంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణు గోపాల్, కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ నాయకులు ఎస్.కె. సాబీర్ పాషా, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం. శ్రీలత, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ దాసరి శ్రీనివాస్, కో-కన్వీనర్లు చదలవాడ సూరి, కూసపాటి శ్రీనివాస్, మంద హనుమంతు, మద్దెల శివకుమార్, దాసరి సారథి. మధుబాబు. దాసరి చక్రి దాసరి సంధ్య.. రవి. మొగిలి. తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >