Posted on 2026-04-06 08:30:49
క్షేత్రస్థాయిలో పరిశీలించిన టీజీఎన్పీడీసియల్ సీఎండీ వరుణ్ రెడ్డి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్‌లూమ్ పరిశ్రమల అభివృద్ధికి విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తుందని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన స్థానిక పవర్‌లూమ్ (విద్యుత్ మగ్గాల) పరిశ్రమను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మగ్గాల పనితీరు, విద్యుత్ వినియోగ విధానం, ఉత్పత్తి ప్రక్రియలను స్వయంగా పరిశీలించిన సీఎండీ, పరిశ్రమలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా విద్యుత్ ఆదా సాధించడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అవకాశాలపై అధికారులతో చర్చించారు. తరువాత నేతన్నలతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన వరుణ్ రెడ్డి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ముఖ్యంగా విద్యుత్ రాయితీలు, లో- ఓల్టేజ్ సమస్యలు నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై కార్మికులు తమ విన్నపాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన సీఎండీ, విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేతన్నల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్నామని , పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాను అందించడం టీజీఎన్పీడీసియల్ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. సిరిసిల్ల పవర్‌లూమ్ పరిశ్రమ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న ఆయన, నేతన్నల జీవనోపాధి మెరుగుదలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
#Sircilla #sircillanews #rajannasircilla #sircilla rajanna district
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >