Posted on 2026-04-06 13:55:21
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం స్థానిక గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ లీలా కృష్ణ డాక్టర్ మురళీకృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
అనంతరం వక్తలు మాట్లాడుతూ పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్థానికంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగా కార్పోరేట్ స్థాయి విద్యను అందిస్తూ పూర్తిస్థాయి మౌలిక వసతులతో నూతన ఆవిష్కరణలతో విద్యాసంస్థ నిర్వహిస్తున్న యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోటీ పరీక్షలలో స్థానిక విద్యార్థులు ప్రపంచీకరణలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టామని ప్రధానోపాధ్యాయులు చిలుక వేణు కిరణ్ తెలిపారు.
ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, మిత్రులు తదితరులు వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >