| Daily భారత్
Logo




పెద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు... దంపతుల దుర్మరణం

News

Posted on 2026-04-06 15:49:24

Share: Share


పెద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు... దంపతుల దుర్మరణం

వృద్ధ దంపతులు, ఇద్దరు చిన్నారులను రక్షించిన స్థానిక యువకులు.

వెలగతోడులో విషాద ఛాయలు

డైలీ భారత్, మండపేట: మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకేటి పాకలు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న మృతుడి తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులను స్థానిక యువకులు సాహసోపేతంగా రక్షించారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామమైన వెలగతోడులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మండపేట రూరల్ సీఐ దొరరాజు, ఎస్సై కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం… మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన బోగిళ్ల వీర వెంకట సతీష్ (40) రాజమహేంద్రవరం పేపర్‌మిల్లులో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 3న కాకినాడలో జరిగిన కుటుంబ వివాహ వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అక్కడి నుంచి ఆదివారం రాత్రి తమ స్వగ్రామం వెలగతోడుకు కారులో బయలుదేరారు.

కారు సతీష్ స్వయంగా నడుపుతున్నారు. ముందు సీటులో ఆయన పక్కన భార్య పద్మ (36) కూర్చుండగా, వెనుక సీట్లలో సతీష్ తండ్రి వెంకట్రావు, తల్లి పద్మ, కుమారులు మోక్షజ్ఞ, జితేష్ ప్రయాణిస్తున్నారు. మండపేట నుంచి పేకేటి పాకలు రహదారిలో వెలగతోడు వైపు వెళ్తుండగా, పేకేటి పాకలు సమీపంలోని పెద్ద కాల్వలోకి కారు అదుపు తప్పి దూసుకుపోయింది.

ప్రమాదంలో కారు ముందుభాగం కాల్వ నీటిలో కూరుకుపోగా, వెనుక భాగం పైకి కనిపించింది. ఈ సమయంలో అక్కడున్న స్థానిక యువకులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వృద్ధ దంపతులు, ఇద్దరు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే డ్రైవింగ్ సీటులో ఉన్న సతీష్, ఆయన భార్య పద్మ నీటిలో మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న మండపేట రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సాయంతో కారును బయటకు తీయించారు. అనంతరం మృతదేహాలను వెలికి తీసి మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్ తెలిపారు.

ఒకే ప్రమాదంలో గ్రామానికి చెందిన యువ దంపతులు మృతి చెందడంతో వెలగతోడులో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో గ్రామం మౌనవిలాపంలో మునిగిపోయింది.

Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >