| Daily భారత్
Logo




మహాత్మ బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహణ

News

Posted on 2026-04-20 14:58:10

Share: Share


మహాత్మ బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహణ

డైలీ భారత్, కామారెడ్డి: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వర జయంతిని IDOC, కామారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్ మరియు మధు మోహన్ మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ, మహాత్మ బసవేశ్వరుడు (1134–1196) 12వ శతాబ్దానికి చెందిన గొప్ప భారతీయ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి మరియు లింగాయత్ ధర్మ స్థాపకుడు అని పేర్కొన్నారు. కులవ్యవస్థ, లింగ వివక్షత మరియు మూఢనమ్మకాలపై పోరాడి, "అనుభవ మంటపం" ద్వారా సమానత్వం, సత్యం మరియు శ్రమ గౌరవాన్ని ప్రచారం చేసిన మహనీయుడు అని వివరించారు.

"కాయకವೇ కైలాస" (కష్టపడి పనిచేయడమే కైలాసం) అనే సందేశంతో శారీరక శ్రమకు, నిజాయితీకి ప్రాధాన్యత ఇచ్చిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

అలాగే బహుజన సంఘాల నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ , బి.సి. అభివృద్ధి అధికారి జయరాజ్  సహాయ అభివృద్ధి అధికారి చక్రధర్  బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, బి.సి. నాయకులు నాగరాజు, లింగాయత్ సమాజ ప్రతినిధులు కపిల ప్రభాకర్ గారు మరియు ఇతర నాయకులు అశ్వక్, నరేష్,శాంతయ్య, స్వప్న, పవన్ తదితరులు, జిల్లా అధికారులు మరియు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >