| Daily భారత్
Logo




విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు

News

Posted on 2026-04-20 13:57:43

Share: Share


విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు

డైలీ భారత్, మహబూబ్ నగర్: జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం మహబూబ్‌నగర్‌లోని ఎస్.వి.ఎస్ వైద్య కళాశాలలో యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డి.ఎస్.పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వారి విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఇటువంటి అనైతిక చర్యలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీస్తాయని, సమాజంలో వారి ప్రతిష్టను తగ్గిస్తాయని తెలిపారు.

విద్యార్థులు పరస్పరం గౌరవం, సహకారం, స్నేహభావంతో ఉండాలని సూచిస్తూ, కొత్తగా చేరిన విద్యార్థులను ఆత్మీయంగా స్వాగతించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కళాశాలల్లో ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం నెలకొల్పడం కోసం ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు.

ర్యాగింగ్‌కు సంబంధించి ఏవైనా ఘటనలు గమనించినప్పుడు వెంటనే కాలేజ్ యాజమాన్యం లేదా పోలీసులకు సమాచారం అందించాలని, బాధితులు భయపడకుండా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న యాంటీ-ర్యాగింగ్ చట్టాలు విద్యార్థుల రక్షణ కోసం ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ భూపాల్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

#MahabubnagarPolice #antiragging

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >