| Daily భారత్
Logo




జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ

News

Posted on 2026-04-23 15:06:19

Share: Share


జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌వార్డ్, అవుట్‌వార్డ్ విభాగాలు, రక్తపరీక్ష కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై సమగ్రంగా ఆరా తీశారు.

రక్తపరీక్షల నిర్వహణ, నమోదు విధానాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి సమయపాలన పాటించాలని ఆదేశించారు. మందుల నిల్వ గది (స్టాక్ రూమ్)ను పరిశీలించి స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయా అనే విషయంపై అధికారులను ప్రశ్నించారు.

వేసవికాలంలో వడదెబ్బలు తగిలే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు సహా అవసరమైన మందులు సమృద్ధిగా నిల్వలో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి రోగికి తక్షణ చికిత్స అందేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆదేశించారు. ప్రజలకు విశ్వసనీయమైన వైద్య సేవలు అందించడం ఆరోగ్య శాఖ బాధ్యత అని పేర్కొన్నారు.

#BhadradriKothagudem #Karakagudem #PublicHealth #PHC #Healthcare #Telangana

Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >