Posted on 2026-05-11 15:58:13
డైలీ భారత్, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 250 బెడ్లకు పైగా ఉన్న ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ కమిటీ, క్వాలిఫైడ్ ఆఫీసర్ తప్పనిసరి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫైర్ సేఫ్టీపై రివ్యూ నిర్వహించాలి. ఆస్పత్రుల్లో జరిగే 80 శాతం ప్రమాదాలకు ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ కారణమని, నాన్-కంబస్టబుల్ మెటీరియల్, ఐఎస్ఐ మార్క్ ఎలక్ట్రికల్ వస్తువులనే వాడాలని సూచించింది. ఏటా రెండుసార్లు మాక్ డ్రిల్స్ నిర్వహించి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >