Posted on 2026-05-21 20:49:41
కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ద్వారా పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా
తాడ్వాయి పోలీసుల పకడ్బందీ దర్యాప్తు – పక్కా సాక్ష్యాధారాలతో నిరూపితమైన నేరం.
చిన్నారులపై దారుణాలకు తావులేదు – చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరు.
బాధితురాలికి భరోసా - నేరస్తుడికి శిక్ష: అంకితభావంతో పనిచేసిన అధికారులను అభినందించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ .
డైలీ భారత్, కామారెడ్డి: ఫిర్యాదుదారురాలు తేదీ 05-08-2022 నాడు తన కుమార్తె ఉదయం ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిపింది. అయితే సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్కూల్‌కు వెళ్లి విచారించగా, ఆమె ఆ రోజు స్కూల్‌కు రాలేదని తెలిసింది. దీంతో బంధువుల ఇళ్లలో, సమీప గ్రామాల్లో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. అనంతరం ఫిర్యాదుదారురాలు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేసు వివరాల్లోకి వెళితే..,
మహమ్మద్ అబ్దుల్ రహీం (20), తండ్రి మహమ్మద్ అమీర్ హుస్సేన్, ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అప్పుడప్పుడు టెంట్ హౌస్‌లో కూడా పనిచేస్తుండేవాడు. టెంట్ హౌస్ సమీపంలోని ఐస్‌క్రీమ్ దుకాణానికి మైనర్ బాలిక తరచూ రావడం గమనించిన నిందితుడు, ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ చనువు పెంచుకున్నాడు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పదవ తరగతి చదువుతున్న అమాయక బాలికను లక్ష్యంగా చేసుకుని, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి “నిన్ను పెళ్లి చేసుకుంటాను” అని నమ్మబలికాడు. బాలిక తాను మైనర్‌నని, తన వెంట పడవద్దని పలుమార్లు చెప్పినా వినకుండా, ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలని పథకం పన్నాడు.
తన మాటలను నమ్మిన బాలిక వయసు రీత్యా ఏమి జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితిని ఆసరాగా తీసుకుని, నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ముందస్తు ప్రణాళికతో ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించుకుని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, భయపెట్టి బలవంతంగా లైంగికంగా వేధించాడు.
05-08-2022 నాడు స్కూల్‌కు వెళ్తున్న సమయంలో మాయమాటలు చెప్పి మైనర్ బాలికను కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ కొంతకాలం వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఆమెపై లైంగిక వేధింపులను కొనసాగించాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, చివరకు ఢిల్లీలో మైనర్ బాలికను గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలను విచారించి నిందితుడు మహమ్మద్ అబ్దుల్ రహీం, తండ్రి అమీర్ హుస్సేన్, తాడ్వాయి గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించి పోక్సో చట్టం మరియు SC/ST చట్టం కింద కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (రేప్ & పోక్సో కేసుల విచారణ కోర్టు) జిల్లా న్యాయమూర్తి డా. CH. V.V.R వరప్రసాద్ నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయని తేల్చి, అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించి, బలమైన సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన అప్పటి డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, ప్రస్తుత డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు, పోలీసు తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీ కె. శేషు, శ్రీ సూర్యప్రసాద్, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ వై. నరేష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ టి. సాయిబాబులను జిల్లా ఎస్పీ అభినందించారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >