Posted on 2026-06-20 19:30:39
డైలీ భారత్,దమ్మన్నపేట: జడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేట పాఠశాల విద్యార్థి చిప్పల విశాల్ ఎన్ఐటీ వరంగల్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక మెంటరింగ్ కార్యక్రమానికి ఎంపికయ్యాడు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు తెలిపారు
2025 జనవరి నెలలో జడ్చర్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ మాన్‌క్ (INSPIRE MANAK) పోటీలలో విశాల్ ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. గైడ్ టీచర్ మరియు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్ మార్గదర్శకత్వంలో రూపొందించిన “జంతు మృత కళేబరాల తొలగింపు ట్రాలీ” ఆవిష్కరణ జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం.
ఈ నేపథ్యంలో జూన్ 22న ఎన్ఐటీ వరంగల్‌లో నిర్వహించనున్న మెంటరింగ్ కార్యక్రమంలో విశాల్ తన గైడ్ టీచర్ తాడూరి సంపత్ కుమార్‌తో కలిసి పాల్గొననున్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్ఐటీ ప్రొఫెసర్లు, విద్యా మరియు సాంకేతిక నిపుణులు ఆవిష్కరణను మరింత మెరుగుపరచడం, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం అవసరమైన సూచనలు, సలహాలు అందించనున్నారు.
విద్యార్థి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, జిల్లా సైన్స్ అధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ విశాల్‌కు, గైడ్ టీచర్ తాడూరి సంపత్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >