| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

News

Posted on 2026-07-10 14:35:04

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ మరియు జోనల్ స్థాయి డ్యూటీ మీట్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు తమ ప్రతిభను చాటుకున్నారు. క్రీడలు, డ్యూటీ రెండింటిలోనూ రాణించిన క్రీడాకారులను, అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్ర స్పోర్ట్స్ మీట్‌లో 3 పతకాలు...

మల్కాజిగిరి కమిషనరేట్ వేదికగా జులై 07 నుండి 09 వరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర 5వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సిరిసిల్ల జిల్లా పోలీసులు మొత్తం 3 పతకాలు కైవసం చేసుకున్నారు.

గోల్డ్ మెడల్ : యోగా విభాగంలో రిజర్వ్ కానిస్టేబుల్ దేవారాజ్

సిల్వర్ మెడల్ : పవర్ లిఫ్టింగ్‌లో ఆర్ముడ్ కానిస్టేబుల్ సంతోష్  

బ్రాంజ్ మెడల్ : ఆర్మ్స్ రెజ్లింగ్‌లో ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్

జోనల్ డ్యూటీ మీట్‌లోనూ రాణింపు... 

కరీంనగర్ వేదికగా జరిగిన జోనల్ స్థాయి డ్యూటీ మీట్‌లో వివిధ కేటగిరీలలో ప్రతిభ కనబర్చిన వారిని ఎస్పీ అభినందించారు. వారిలో సిరిసిల్ల రూరల్ సి.ఐ నాగేశ్వరరావు, బోయినపల్లి ఎస్.ఐ రమాకాంత్, వీర్నపల్లి ఎస్.ఐ లక్ష్మణ్, కానిస్టేబుళ్లు శేఖర్, హరీష్, కిరణ్ ఉన్నారు.

పతకాలను అందజేసిన ఎస్పీ ...

ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో విజేతలకు పతకాలు అందజేసిన ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ, క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, విజేతలు జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని, ఓడినవారు నిరాశ చెందకుండా లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సి.ఐ సిరిసిల్ల రూరల్ నాగేశ్వరరావు, ఆర్.ఐ అడ్మిన్ సురేష్, ఎస్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


#RajannaSircilla, #TelanganaPolice, #SportsMeet #SPMaheshGitte #SircillaPolice

Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >