| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

News

Posted on 2026-07-10 14:47:58

Share: Share


రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతనంగా జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరామ్ మొండయ్య ని తెలంగాణ రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం TGPETA జిల్లా శాఖ అధ్యక్షులు తడుకల సురేష్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా వసతులు, క్రీడా సామగ్రి అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల సంక్షేమంతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని DEOకి సమర్పించారు.

అదేవిధంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న పాఠశాల స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ విలువైన సూచనలు, సలహాలు అందిస్తూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. 

విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో TGPETA జిల్లా నాయకులు పాల్గొన్నారు.


#TGPETA #RajannaSircilla #DEO #SchoolSports #TelanganaEducation

Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >