Posted on 2024-02-25 08:51:48
కాంగ్రెస్ లోకి జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి
ప్రియాంకాగాంధీ సమక్షంలో త్వరలో హస్తం పార్టీలో చేరిక
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ పరిణామం మహేశ్వరం నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతల్లో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. సంవత్సర కాలంగా తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రిని తీగల కుటంబం కలవడంతో ఆ వార్తలు నిజమయ్యేలా కన్పిస్తున్నాయి. కాగా ఈ మధ్యనే వికారాబాద్ జిల్లా ప రిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి-మహేందర్‌రెడ్డి దంపతులు, వారి కుమారుడు సీఎం సమ క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి సీఎంను మర్యాదపూర్వకంగా కలవడంతో జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు భారీషాక్ తగిలినట్టేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి గతంలో హైదరాబాద్ మేయర్‌గా, మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో మహేశ్వరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెల్చిన ఆయన అనంతరం టీఆర్‌ఎ్‌సలో చేరా రు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సబితారెడ్డి చేతులో కృష్ణారెడ్డి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం సబితారెడ్డికూడా సైతం బీఆర్‌ఎస్‌లో చేరడంతో వారి మధ్య వర్గ విభేదాలు పొడసూపాయి. తమకు పార్టీలో గర్తింపు లభించడంలేదని పలుమార్లు తీగల.. కేటీఆర్, కేసీఆర్‌లతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవిస్తానని కేసీఆర్ మాట తప్పారని, మెన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుం డా మోసం చేశారని తీగల తన అనుచరగనంవద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే పార్టీ మారేందుకు కృష్ణారెడ్డి సిద్ధం కాగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆయన కోడలు అనితారెడ్డి అడ్డుకున్నారనే వార్తలొచ్చా యి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేఎల్లార్‌ల తో కృష్ణారెడ్డి సన్నిహితంగా ఉండడం బీఆర్‌ఎస్‌కు మిం గుడు పడలేదు. ఇదే తరుణంలో మామ, కోడలు కృష్ణారె డ్డి, అనితారెడ్డిలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌కు కోలుకోలేని దెబ్బే! కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంకాగాంధీ సమక్షంలో తాము కాంగ్రెస్‌లో చేరుతాం అని అనితారెడ్డి చెప్పడంతో తీగల కుటుంబం కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైం ది. మహేశ్వరంలో బీఆర్‌ఎస్‌కు ఊహించని దెబ్బలు తగు లుతున్నాయి. మరికొందరు బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు సైతం కాంగ్రెస్ చేరతారనే వార్తలొస్తున్నాయి. టీడీపీలో రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి కలిసి పనిచేయడం కూడా కాంగ్రె స్‌లో చేరేలా చేసింది. ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండడంతో బీఆర్‌ఎస్‌కు బీటలు వారే పరిస్థితి ఏర్పడుతోంది.
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >