Posted on 2024-09-10 13:37:53
నేతన్నల మనో వికాస సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఆధ్వర్యంలో సిరిసిల్లలో బి.వై. నగర్ నందు పవర్ లూమ్స్ కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మనో వికాస సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతు మానసిక కుంగుబాటు ఆత్మహత్యలకు దారితీస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యల నివారణకై ఈ రోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతున్నాయని అన్నారు.
ప్రజలలో ఆత్మహత్యలపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా న్యూనతా భావం నుండి బయట పడుతారని అన్నారు. తద్వారా వ్యక్తిలోని మానసిక, ఉద్వేగ పరమైన భావనలు బయటికి వ్యక్త పరుచబడుతాయని అన్నారు.
అత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో గానీ, మిత్రబృందంతో గానీ పంచుకుంటే మనస్సు తేలికై ఆ ఆలోచనల నుండి బయటపడే అవకాశం వుంటుందని అన్నారు.
సమాజంలో విస్తృత చర్చ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని అన్నారు.
మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ గత 15సంవత్సరాలుగా ఆత్మహత్యల నివారణ కోసం నేతన్నల్లో విస్తృత అవగాహన మరియు కౌన్సిలింగ్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
నేతన్నల్లో మానసిక ఆరోగ్యం పెంపెందించేందుకు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
ఎటువంటి మానసిక సమస్యలు ఉన్నా వెంటనే మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ను సంప్రదించి స్వాంతన పొంవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సామాజిక కార్యకర్తలు రాపెళ్లి లత, కొండ ఉమ, వేముల అన్నపూర్ణ, బూర శ్రీమతి లు మరియు కార్మికులు పాల్గొన్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >