Posted on 2024-09-11 11:25:52
ప్రతీ విద్యార్థికి జీవితం పట్ల గోల్ ఉండాలి
సమాజానికి రోల్ మోడల్ గా ఆడపిల్లలు తయారు కావాలి
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ బడులు, వసతి గృహాల్లో చదివే విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. చేవేళ్ల మండలం తోలుకట్ట గ్రామంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థినులతో మమేకం అయ్యారు. తన లీడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు (గోల్ - రోల్) ఉన్నత విలువలతో కూడిన జీవితంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కేఎల్ఆర్.
ఈ సందర్భంగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... మాజీ రాష్ట్రపతి, దివంగత శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో చదువువే ఆయుధం.. ప్రపంచాన్ని అన్ని రంగాల్లో జయించాలన్నా.. విద్యతోనే సాధ్యమని చెప్పారు.
విద్యార్థి దశలో లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుందని వారిలో స్ఫూర్తి నింపారు కిచ్చెన్నగారు.
ఈకార్యక్రమంలో బీసీ (గర్ల్స్) హాస్టల్ హెడ్ మాస్టర్ సహా సిబ్బంది పాల్గొని కేఎల్ఆర్ సంస్థ చేస్తున్న లీడ్ ఇండియా ప్రోగ్రాంను అభినందించారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >