Posted on 2024-09-30 19:03:50
విజ్ఞాన్ డిగ్రీ కళాశాల, యువసత్తా యూత్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమాజంలో యువతీ యువకులు ఆపత్కాల సమయంలో రక్తదానం చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. విజ్ఞాన్ డిగ్రీ కళాశాల మరియు యువసత్తా యూత్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కళాశాల కరస్పాండెంట్ విశ్వనాథ్, ప్రిన్సిపల్ భవాని శంకర్, యువ సత్తా లక్ష్మణ్ తదితరులు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతీ యువకులు చిన్నవయసులో బలంగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఎక్కువసార్లు రక్తదానం చేసే అవకాశం ఉంటుందని వారు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆసక్తి కనబరచాలని సూచించారు. యువతీ యువకుల రక్తాన్ని ఆయన పవిత్రంగా పోల్చారు.
సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నందుకు విజ్ఞాన్ డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని విద్యార్థినీ విద్యార్థులను యువసత యూత్ నిర్వాహకులు లక్ష్మణ్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని, విద్యార్థులు,, పట్టణ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ,అందే మోహన్,పురుషోత్తం రెడ్డి, ముబారాక్ తదితరులు పాల్గొన్నారు..
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >