Posted on 2024-10-01 13:43:19
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో ఎమ్మెల్సీ కవిత చేరారు. మంగళవారం సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి కవిత గురైన విషయం తెలిసిందే. గతంలో తిహాడ్ జైల్లో ఉండగా కవిత రెండు సార్లు అస్వస్థతకు లోనయ్యారు. జూలై 16న తొలిసారిగా కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందించారు. ఆ తర్వాత ఆగస్టు-22న మరోసారి కవిత అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి జైలుకు తీసుకెళ్లారు. కొంతకాలంగా కవిత గైనిక్ సమస్యలతో బాధపడుతూ ఉండటం.. దీనికి తోడు ఇటీవల వైరల్ జ్వరం బారినపడ్డారు. దీంతో.. కవిత భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు.
కవిత జైల్లో ఉండగా 11 కిలోల బరువు తగ్గారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడంతో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి. అంతేకాదు.. సోదరి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన అన్న.. ఒక్కొక్కటిగా బయటికి చెప్పారు. కవితకు బీపీ పెరగడంతో మాత్రలు వేసుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. అంతేకాదు.. జైలు శుభ్రంగా లేదని, కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 11 వేల మంది ఖైదీలు ఉండాల్సిన తిహాడ్ జైల్లో 30 వేల మంది ఉన్నారన్నారు. బెయిల్ విషయంలో ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా ఆమెకు నిరాశే ఎదురైంది.
ఈ ఆగస్టు-27న ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ తర్వాత కవితకు బెయిల్ వచ్చింది. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ ఆమె అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఆమె సుమారు ఐదున్నర నెలలు జైలులోనే ఉన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమె సుమారు 11 కేజీల బరువు తగ్గారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >