Posted on 2024-10-01 14:24:42
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు స్థానిక సెస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల,సిరిసిల్ల యందు NSS ఆధ్వర్యంలో గత నెల సెప్టెంబర్ 17 వ తేదిన ప్రారంభమై రేపు అక్టోబర్ 2 వ తేది మహాత్మా గాంధీ జయంతి తో ముగియనున్న "స్వచ్చత హి సేవా" కార్యక్రమం యొక్క ముగింపు సందర్భంగా విద్యార్థినుల చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి Y. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల అర్పించి విద్యార్ధినుల చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి, మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు తమ తరగతి గదులను మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత అలవాటు చేసుకోవాలని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ G.వనజ కుమారి మాట్లాడుతూ మన కళాశాల,మన గ్రామం పరిశుభ్రంగా ఉంచుకుంటే మన దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుందని,పరిశుభ్రత అనేది మొదట మన నుండే ప్రారంభం కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల NSS ప్రోగ్రాం కోఆర్డినేటర్ మడుపు నవీన్ కుమార్,కళాశాల లెక్చరర్స్ మురళీ,సీతారాము,శ్రీనివాస్,ప్రవీణ్ కుమార్, అఫ్రోజ్ సుల్తానా,గంగరాజు,సునీత,భూపాల్,అనిత మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >