Posted on 2024-10-03 05:39:04
"కర్ర సాములో ఉచిత శిక్షణ"
హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ.
బాలికలకు ప్రత్యేకం
ఆత్మస్థైర్యం ఆలంబనగా..ఆత్మవిశ్వాసమే లక్ష్యంగా...
15 రోజుల ఉచిత శిక్షణ.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కర్ర సాము శిక్షణ శిబిరం ప్రభుత్వ కళాశాల మైదానంలో ప్రారంభం అయింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి సంస్థ ఫౌండర్ ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతు బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడమే లక్ష్యంగా ఉచిత కర్ర సాము శిక్షణ ఏర్పాటు చేసినట్లు వివరించారు. బాలికలు తమ ఆత్మ రక్షణలో ఒక ఆయుధంగా కర్ర సాము నిలువనుందని పేర్కొన్నారు.
సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం కర్ర సాము ద్వారా బాలికల్లో వస్తుందని అన్నారు.
కుంగ్ ఫు మాస్టర్ వడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 15 రోజుల శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఉచిత శిక్షణ శిబిరాలు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని బాలికలందరికి విడతల వారీగా కర్ర సాము ఉచిత శిక్షణ అందివ్వనున్నట్లు తెలిపారు.
హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి దాసరి తిరుమల మాట్లాడుతు 12 సంవత్సరాల వయస్సు కల్గిన బాలికలు మొదలు 25 సంవత్సరాల వయస్సు వారికి కర్ర సాము శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కోసం 56 మంది బాలికలు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
కుంగ్ ఫు మాస్టర్ వడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ కర్ర సాములో 14 రకాల ప్రక్రియలు ఉన్నట్లు తెలిపారు. హెల్పింగ్ హార్ట్స్ సంస్థ బాలికల కోసం కర్ర సాము నేర్పించేందుకు ముందుకు రావడం అభినందనీయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుంగ్ ఫు మాస్టర్ వడ్నాల శ్రీనివాస్ హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు ఆలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి దాసరి తిరుమల, యెలగొండ ఆంజనేయులు, కనుకుంట్ల సంజన బాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >