Posted on 2024-10-05 12:51:47
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నా చౌక్ వద్ద రైతులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. దీక్షకు సంఘీభావం తెలిపిన సేవాలాల్ సేన జిల్లా కమిటీ
ఈ సమావేశానికి ఉద్దేశించి సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శివ నాయక్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రైతులకు వివిధ హామీలు ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారం వచ్చాక రైతులు విశ్వసినియంచారు . రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్రంలోనే 50% కూడా రుణమాఫీ చేయలేదు . ఎన్నికల సమయంలో ఎకరాకు 15000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి అది కూడా వానాకాలం సీజన్ అయి ఉండటంలో ఇప్పుడు దాకా రైతు భరోసా ఊసే లేదు అదేవిధంగా కౌలు రైతులకు ఎకరానికి 12000 రూపాయలు,ఎలక్షన్ సమయంలో చెప్పి అధికారం ఏర్పరచుకున్నాక కవులు రైతు పరిస్థితి ధననీయంగా ఏర్పడింది. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటును ఇస్తామని చెప్పి కరెంటు కోత అవ్వడంలో రైతులు పంట పొలాలు ఎండిపోతున్నాయి.జిల్లా అధ్యక్షుడు
సేవాలాల్ సేన రైతుల పక్షాన ప్రభుత్వానికి పలు డిమాండ్ చేస్తున్నారు.
ఎలాంటి షరతులు లేకుండా భూమి ఉన్న రైతులందరికీ రెండు లక్షల రుణ మాఫీ చేయాలి
ధరణి 2018 చట్టం రద్దు చేయాలి
మ్యానువల్ పహాని వ్యవస్థను కొనసాగించి. రాతలైన రైతులందరికీ పట్టా పాస్ పుస్తకం కల్పించాలి
భూమి ఉన్న ప్రతి రైతుకి రైతు కూలీలకు రైతు బీమా రైతు బంధు కల్పించాలి
రైతులందరికీ పంట రుణాలు అందించాలి
తుమ్మలచెరువు. ఎర్రగడ్డ. కల్స రహదారి నిధులు మంజూరు చేయాలి
పాండురంగాపురం గ్రామం ను కేటీపీఎస్ ప్రభావిత ప్రాంతాలను దత్తత గ్రామంలో తీసుకోవాలి
అర్హతలైన అందరికీ గృహాలు మంజూరు చేయాలి
పామ్ ఆయిల్ రైతులకు పహానిల ద్వారా డ్రిప్ సబ్సిడీ ఇవ్వాలి
వృద్ధాప్యం వితంతు ఒంటరి మహిళకు దరఖాస్తులు చేసిన వెంటనే పింఛను మంజూరు చేయాలి
నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలి
హెల్త్ క్యాంప్ నిర్వహించాలి
యాదవులు అందరికీ గొర్రెల యూనిట్ మంజూరు చేయాలి
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శివ నాయక్, యువసేన జిల్లా అధ్యక్షుడు భరత్ నాయక్, విద్యార్థి సేన ప్రధాన కార్యదర్శి వంశి నాయక్, రాష్ట్ర నాయకులు ధరావత్ కృష్ణ నాయ, పాల్వంచ మండల అధ్యక్షుడు జరపలా పరమేష్ నాయక్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >