Posted on 2024-10-09 00:38:19
ఎంపీఓకి వినతి పత్రం అందిస్తున్న దృశ్యం
డైలీ భారత్, పాల్వంచ: తోగూడం ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగం కల్పించిన గిరిజన చట్టాలు అపహాస్యమవుతున్నాయని సేవాలాల్ సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. మంగళవారం సేవాలాల్ సేన మండలాధ్యక్షుడు జర్పుల పరమేష్ నేతృత్వంలో నాయకులు మండల పంచాయతీ అధికారి బొగ్గ నారాయణకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజన హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు. తోగూడెంలో కొద్దిమంది గిరిజనులను మచ్చిక చేసుకున్న గిరిజనేతరులు క్వారీల ఏర్పాటుతో కోట్ల వ్యాపారం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతి లేని క్వారీలతో నిత్యం వ్యాపారం చేస్తున్నా.. అధికార యంత్రంగం ప్రేక్షక పాత్రకు పరిమితమవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఎన్ని క్వారీలకు గ్రామపంచాయతీ తీర్మానాలు ఇచ్చిందో, వివరాలు తెలపాలని కార్యదర్శి, ఎంపీఓలకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివ నాయక్, శ్రీను నాయక్, రమేష్ నాయక్, సంతోష్ లు న్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >