| Daily భారత్
Logo




భూసేకరణలో అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-10-15 18:49:00

Share: Share


భూసేకరణలో అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం చేసిన భూ సేకరణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని మంగళవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ యం.జి. గోపాల్ కి ఫిర్యాదు చేశారు.సిద్దాపుర్ గ్రామంలో సర్వే నెంబర్ 252 (122-00 ఎకరాల),278 (ఎకరాలు.66-29), మరియు సర్వే నెంబర్ 361 (ఎకరాలు.14-05 గుంటలు) లలో దాదాపు 230 ఎకరాల 10 గుంటల భూమిలో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి చేయుటకు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే మొత్తం సేకరించిన భూమిలో దాదాపు 140 ఎకరాల భూమి అసైన్ భూమి, మిగతాది భూమి ప్రభుత్వం. తేదీ 08, 01, 2021 నాడు దినపత్రికలలో భూమి సేకరణకు సంబంధించి ఫాం-సి నోటిఫికేషన్ ను జారీ చేసి దాదాపు 250 మంది రైతులను నుంచి 240 ఎకరాల 16 గుంటల భూమిని సేకరణ చేసినట్లు ప్రకటించి భూమి పరిహారం డబ్బులను వారి ఖాతాలకు జామచేయటం జరిగింది. అయితే సిద్ధాపూర్ గ్రామానికి చెందిన అసైన్డ్ పట్టాదారులు, ఖాస్తుదారు రైతులు భూసేకరణలో జరిగిన అక్రమణాలు ఎమ్మెల్యే దృష్టికి తెస్తూ....దాదాపు 80 మంది వ్యక్తులు భూ రికార్డులలో వారి పేరు నమోదు కాకున్నా పరిహారాన్ని పొందారు. అలాగే కొంత మంది వ్యక్తులు రెవెన్యూ రికార్డులలో వారి పేరుపై నమోదైన విస్తీర్ణం కన్నా అధిక పరిహారం పొందారు అని తెలిపారు. ఇట్టి విషయంపై లోతైన దర్యాప్తు చేసి భూసేకరణలో అక్రమణాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ విజిలెన్స్ కమిషనర్ ఆధారంతో సహా లేఖను సమర్పించారు..

Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >