Posted on 2025-04-28 18:37:35
డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా: పట్టపగలే మార్కెట్లో అందరూ చూస్తుండగానే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది ఓ వ్యక్తి మరో వ్యక్తిని అతి కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ ను ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ కత్తితో మెడపై పొడిచి దారుణంగా హత్య చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడి తో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియా ల్సి ఉంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >