Posted on 2025-06-07 19:13:05
డైలీ భారత్, గద్వాల: గద్వాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పార్కింగ్ చేసిన లారీని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు అయితే బాధితుడు సాదిక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఎస్సై కళ్యాన్ కుమార్ విచారణ చేపట్టారు. అయితే ఎత్తుకెళ్లిన లారీని సాంకేతిక విభాగ సిబ్బంది ఆధ్వర్యంలో పరిశీలించారు. అయితే వనపర్తి పెబ్బేర్ బిజినపల్లి నాగర్ కర్నూల్ బాల్నగర్ మీదుగా లారీ వెళ్తున్నట్లు గుర్తించారు. దాదాపు 8 గంటల వ్యవధిలోనే బాల్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద లారీని గుర్తించారు. దీంతో లారీని పోలీసులు స్వాధీనం చేసుకొని గద్వాల స్టేషన్ కు తరలించారు లారీ విలువ 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు కేసు చేదనలో సాంకేత విభాగ సిబ్బంది చంద్రయ్య, కిరణ్, రాజు యాదవ్ లు కృషి అభినందనీయ మన్నారు. స్వాధీనం చేసుకున్న లారీని బాధితులకు ఇవ్వనున్నట్లు ఎస్సై తెలిపారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >