| Daily భారత్
Logo




గోదావరినదిలో స్నానం చేసేందుకు వెళ్లి మృత్యువాత పడిన ఆరుగురు యువకుల గల్లంతు

News

Posted on 2025-06-08 08:09:59

Share: Share


గోదావరినదిలో స్నానం చేసేందుకు వెళ్లి మృత్యువాత పడిన ఆరుగురు యువకుల గల్లంతు

డైలీ భారత్జయశంకర్‌ భూపాలపల్లి: పెళ్లికోసం వెళ్లిన యువకులు సరదాకు గోదావరినదిలో స్నానం చేసేందుకు వెళ్లి మృత్యువాత పడిన సంఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది. ఘటనలో మొత్తం 6 గురు యువకులు గల్లంతవడం తో విషాదం నెలకొందిపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహదేవ్పూర్మండలం అంబట్పల్లికి చెందిన గొలుకొండ మల్లయ్య ఇంట్లో ఇటీవల వివాహం జరిగింది. వివాహానికి  హాజరైన బంధువుల్లో ఎనిమిది మంది శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో అంబట్పల్లి నుంచి ఆటోలో మేడిగడ్డకు వెళ్లారు.

  గోదావరిలో స్నానం చేయడానికి అని వెళ్లిన వారిలో మొదట పట్టి మధుసూదన్అనే యువకుడు నదిలోకి దిగాడు. అయితే అక్కడే ఉన్న గుంతను గమనించకుండా దిగడంతో మునిగిపోయాడు. మధుసూదన్మునిగి పోవడాన్ని గమనించిన అతని సోదరుడు పట్టి శివమనోజ్ఆయనను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అతను కూడా గుంతలో మునిగిపోయాడు. అలా ఒకరిని కాపాడపోయి ఒకరుగా మొత్తం ఆరుగురు గల్లంతయ్యారు. కాగా మధుసూదన్‌, మనోజ్ తండ్రి పట్టి వెంకటస్వామి ఆటలోనే వారంతా అక్కడికి వెళ్లారు. ఆయన ఆటోను నది ఒడ్డున పెట్టి వచ్చేలోపే ఇద్దరూ కుమారులు కళ్లముందే నదిలో గల్లంతవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు.గల్లంతయిన వారిలో నలుగురు అంబట్పల్లికి చెందినవారు కాగా మరో ఇద్దరు కొర్లకుంట గ్రామానికి చెందిన వారున్నారు. గల్లంతయిన వారిలో రక్షిత్‌, సాగర్, మధుసూదన్‌, రాంచరణ్‌, శివమనోజ్‌, రాహుల్ఉన్నారు. అందరూ కూడా 20 ఏండ్ల లోపు వారే కావడం విషాదకరం.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >