| Daily భారత్
Logo




ఈ నెల 26 నుండి హైదరాబాద్-సికింద్రాబాద్ బోనాల పండుగ

News

Posted on 2025-06-09 17:42:32

Share: Share


ఈ నెల 26 నుండి హైదరాబాద్-సికింద్రాబాద్ బోనాల పండుగ

గోల్కొండ మహంకాళి ఆలయం నుంచి స్టార్ట్

రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం  హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాలు బోనాల పండుగకు సిద్ధమవుతున్నాయి.

డైలీ భారత్, హైదరాబాద్: ఈ నెల 26 నుంచి ఆషాఢ బోనాల వేడుకలు ప్రారంభమై నెలరోజుల పాటు జరగనున్నాయి. తొలుత గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనం సమర్పిస్తారు. హైదరాబాద్లో 28 ప్రముఖ ఆలయాలు ఉండగా.. వీటి పరిధిలో బోనాలు నిర్వహించనున్నారు. ఆయా ఆలయాల్లో పూజా కార్యక్రమాలకు హాజరయ్యే అతిథుల వివరాలను ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్లు లిస్ట్ అవుట్ చేశారు. అంతేకాకుండా, గతంలో జరిగిన పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.

ఆలయాలకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. చలువ పందిళ్లు వేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. బోనం సమర్పణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ ఇబ్బందులపై రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై అధికారులకు ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఒకటిరెండ్రోజుల్లో ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది.

బల్కంపేట ఎలమ్మ ఆలయంలో జులై 1న

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జులై 1వ తేదీన బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, 20, 21 తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహినీ మహంకాళి ఆలయంలో, నాచారంలోని మహంకాళి సమేత మహంకాళేశ్వర ఆలయంలో బోనాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

ఏర్పాట్లకు 20 కోట్లు మంజూరు

ఆషాఢ బోనాల ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయాలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. గ్రేడ్లను బట్టి ఆలయాలకు దేవాదాయశాఖ ఫండ్స్రిలీజ్ చేసింది. బోనాల వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >