| Daily భారత్
Logo




రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

News

Posted on 2025-06-16 15:40:10

Share: Share


రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

డైలీ భారత్, భువనగిరి: తమ ప్రేమను పెద్దలు కాదంటరన్న అనుమానంతో ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం జిల్లా జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నెమలికొండకు చెందిన మచ్చ శృతి(23), కె. వినయ్ కుమార్(25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు ఇష్టపడటంతో కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ మధ్యే వారి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. అయితే తమ ప్రేమను కాదంటారని, తమ వివాహానికి పెద్దలు అంగీకరించరని వారిద్దరూ అనుమానించారు. దీంతో ఆదివారం అర్థరాత్రి ఇంటినుంచి బయలు దేరి బయటకు వచ్చారు. తమ ప్రేమను కాదంటే విడిపోయి బతకలేమని నిర్ణయించుకున్న వారిద్దరూ భువనగిరి శివారులో రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం వారి శవాలను గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా పంచనామా నిమిత్తం మృతదేహాలను జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >