Posted on 2025-07-08 18:29:07
ఒకేసారి మూడు కార్లను ఢీకొన్న లారీ.
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జాతీయ రహదారిపై 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రాయన్ పల్లి వద్ద ఓ లారీ మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద మంగళవారం సాయంత్రం నిమాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ వెనుక వైపు ముందు వెళ్తున్న మూడు కార్లను ఢీకొట్టింది. అంతేకాకుండా.. కార్లను ఢీకొని లారీ ఆగిపోవడంతో వెనుక నుంచి వచ్చిన మరో లారీ దానిని ఢీకొట్టింది. అలాగే ఈ ఘటనలో ఓ బైకుపై వెళ్తున్న వారు సైతం ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు భారీగా ధ్వంసం అయింది.
కాగా.. ఒక కారు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఇందులో ఉన్న కామారెడ్డికి వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. మరో కారులో హైదరాబాద్ వెళ్లే కారు పూర్తిగా ధ్వంసం కాగా.. అందులో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు దంపతులకు గాయాలవడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వీరు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తనూర్ గ్రామానికి చెందిన వారిని సమాచారం. భారీ ప్రమాదం జరగడంతో రోడ్డుపై కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >