| Daily భారత్
Logo




"కార్మికులకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ "

News

Posted on 2025-07-15 13:13:59

Share: Share


"కార్మికులకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ "

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నెహ్రూనగర్ నందు గల పవర్ లూమ్ కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ కౌన్సిలింగ్, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినారు.

ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ హాజరై కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా  డాక్టర్ ప్రవీణ్ కుమార్ కార్మికులతో మద్యపాన వ్యసనం గురించి, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి మాటాడిన అనంతరం మద్యం మానేయాలనుకున్న కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది.

డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...

మద్యపాన వ్యసనం ఒక సైకోసోమాటిక్ డిసార్డర్ వ్యాధి అని తెలిపారు. ఇది మెదడు, నరాల వ్యవస్థ మీద చూపే ప్రభావం వల్ల వ్యక్తి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడని తెలిపారు.

దురలవాట్లు, మానసిక సమస్యలు, వ్యాధులు నుండి బయటపడేందుకు ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో తనను సంప్రదించాలని కోరారు.

సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ అతిగా మద్యపాన వ్యసనానికి  లోనైన వ్యక్తిలో పారానాయిడిజం అనే అనుమాన ప్రవృత్తి పెరుగుతుందని తెలిపారు.  తద్వారా బార్య శీలాన్నీ శంకించడం, భార్యపై అనుమాన ప్రవృత్తి పెరగడం వల్ల కుటుంబ సంబంధాలు విచ్చిన్నమౌతాయని అన్నారు.

వ్యసనాల నుండి త్వరగా బయట పడేందుకు మందులు, కౌన్సిలింగ్ ప్రతి వార్డులో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

తంబాకు నమలడం, బీడీ,సిగరెట్ త్రాగడం మొదలగు వ్యసనాలు మానుకునేందుకు మైండ్ కేర్ సెంటర్ ను సంప్రదించాలని  పున్నంచందర్ తెలిపారు.

కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలుపుతూ త్రిఫ్ట్ పథకం, నేతన్న భీమ, మహిళాశక్తి చీరల  ఉత్పత్తి పథకం, యార్న్ సబ్సిడీ లాంటి వాటిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె. పున్నంచందర్, వస్త్రోత్పత్తి దారుడు బూట్లు సుదర్శన్, మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి మరియు కార్మికులు పాల్గొన్నారు.

Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >