| Daily భారత్
Logo




ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య?

News

Posted on 2025-07-15 10:56:45

Share: Share


ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య?

డైలీ భారత్, గండికోట: జిల్లాలోని జమ్మలమడుగు  పరిధిలో పర్యాటక కేంద్రమైన గండికోటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రొద్దుటూరులోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవిగా గుర్తించారు. సోమవారం స్నేహితులతో గండికోటకు వెళుతున్నానంటూ ఇంట్లో చెప్పి వెళ్లింది విద్యార్థిని. రాత్రి గడిచినప్పటికి విద్యార్థిని ఇంటిక రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైష్ణవి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మంగళవారం ఉదయం గండికోటలోని ముళ్లపొదల్లో ఓ అమ్మాయి నగ్నంగా శవమై పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు

పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా వైష్ణవిదిగా గుర్తించారు. ఆపై విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దారుణంగా హత్యకు గురైన కన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఎర్రగుంట్ల మండలం హనుమాన్ దుర్తి గ్రామానికి చెందిన వాసి. విద్యార్థిని ఐదు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడితో ప్రేమవ్యవహారం ఉన్నట్లు సమాచారం. యువకుడు లోకేష్‌తో నిన్న బైక్‌పై వైష్ణవి గండికోటకు వెళ్ళినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. జమ్మలమడుగు పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >