| Daily భారత్
Logo




మలక్‌పేట్ కాల్పుల కేసులో 9 మంది నిందితుల గుర్తింపు..నలుగురు పోలీసుల అదుపులో

News

Posted on 2025-07-16 12:23:57

Share: Share


మలక్‌పేట్ కాల్పుల కేసులో 9 మంది నిందితుల గుర్తింపు..నలుగురు పోలీసుల అదుపులో

డైలీ భారత్, హైదరాబాద్: మలక్‌పేట్‌లో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు గణనీయంగా పురోగమిస్తోంది. సీపీఐ నేత చందురాథోడ్‌పై జరిగిన కాల్పుల కేసును పోలీసులు కీలక మలుపు తిప్పారు. ఇప్పటివరకు మొత్తం 9 మంది నిందితులను గుర్తించినట్టు తెలిపారు.

చందురాథోడ్‌ హత్యకు కొంతకాలంగా కొనసాగుతున్న వ్యక్తిగత విభేదాలే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా రాజేష్ అనే వ్యక్తి చందురాథోడ్ మధ్య భూముల గట్లపై వివాదాలు సాగుతున్నట్టు ఆధారాలు లభించాయి. ఈ భూమి వివాదాలు కంట్లూర్ పరిధిలో చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.

అంతేకాకుండా, వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. వ్యక్తిగత పరంగా ఏర్పడిన కలహాలే ఈ హత్యకు దారితీశాయని అంచనా వేస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో చందురాథోడ్‌ను నలుగురు నేరుగా హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. వారితో పాటు మరో ఐదుగురు హత్యకు సహకరించినట్టు తేలింది. ఘటన అనంతరం నిందితులంతా చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించారు.

ప్రస్తుతం హత్యకు సహకరించిన నలుగురు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఐదుగురి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 10 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

ఈ కేసులో సాంకేతిక ఆధారాలు, మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల పట్ల స్పష్టతకు పోలీసులు చేరుకుంటున్నారు. రాజకీయ కోణం ఉందా..? అన్న అనుమానాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

పరిస్థితి మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు స్థానికంగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నరు..!!

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >