| Daily భారత్
Logo




ప్రాణాలకు తెగించి ఫ్యామిలీ ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

News

Posted on 2023-12-22 10:46:41

Share: Share


ప్రాణాలకు తెగించి ఫ్యామిలీ ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

డైలీ భారత్, హైదరాబాద్:ఎర్రమంజిల్ సమీపంలో ఓ వాణిజ్య భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంతో అందులో నివసిస్తున్న కొంత మంది తప్పించుకుని బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేశారు.

లోపలి చిక్కుకున్న పలువుర్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ క్రమంలో పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్.. పెను సాహసమే చేశారు. తన ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని మంటల నుంచి కాపాడారు.

ప్రమాదం జరిగి అరగంట దాటిపోయిన ఫైర్ ఫైరింజన్ చేరుకోకపోవడంతో మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు శ్రావణ్ ధైర్యం చేశాడు. లోపలికి ప్రవేశించి చాకచాక్యంగా ఓ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు.

దీంతో కానిస్టేబుల్‌ను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అభినదించారు. పంజాగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీసులు దశరథ రామ్ రెడ్డి, సత్యనారాయణ అనే కానిస్టేబుల్లు సైతం శ్రమించి బాధితులను రెస్కు చేశారు..డంబెళ్ల సాయంతో కిటికీలను పగలగొట్టి వారిని బయటికి తెచ్చారు.

కాగా, ప్రమాదానికి షాక్ సర్కిట్ కారణమా లేదా గ్యాస్ సిలిండర్ లీక్ అవడం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చాయని, తదుపరి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

మెయిన్ రోడ్డుకు సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >