| Daily భారత్
Logo




ఎటపాక రహదారిలో ఇరుక్కుపోయిన టిప్పర్ భారీగా ట్రాఫిక్ జామ్

News

Posted on 2025-08-11 16:12:55

Share: Share


ఎటపాక రహదారిలో ఇరుక్కుపోయిన టిప్పర్ భారీగా ట్రాఫిక్ జామ్

జేసీబీతో మరమ్మతులు చేసిన డా జమాల్ ఖాన్ 

వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుంటున్న జమాల్ ఖాన్ 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుండి చర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలలో భద్రాచలం నుండి గౌరవరం వెళుతున్న మెటల్ లోడు టిప్పర్ అదుపుతప్పి గోతిలో పడిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. గంటల కొలది వ్యవధి కావడంతో రెండు వైపులా భారీ వాహనాలు ఆర్టిసి బస్సులు ప్రైవేటు వాహనాలు చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న జేకేసిటీ ట్రస్ట్ చైర్మన్ ఎండి జమాల్ ఖాన్ వెంటనే ట్రాఫిక్ వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను తెలుసుకొని వెంటనే జెసిబి తెప్పించి గోతులను పూడ్చి రహదారి సౌకర్యాన్ని కల్పించడంతో ఇరు రువైపులా వాహనాల రవాణా క్లియర్ చేశారు. ఇది గమనించిన ఎటపాక పోలీసు సిబ్బంది వాహనాలను అదుపు చేస్తూ భారీ వాహనాలను నియంత్రిస్తూ ట్రాఫిక్ సమస్యను తొలగించారు. టిప్పర్ డ్రైవర్ అనారోగ్యం వలన జ్వర పీడితుడు కావడంతో ఈ ఘటన జరిగిందని తెలియడంతో డ్రైవర్ను తన ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆహారం ఇచ్చి చికిత్సలు కూడా జమాల్ ఖాన్ నిర్వహించారు. భారీ స్థాయిలో చర్ల వైపు నుండి ఎటపాక మండలం మీదుగా తెలంగాణ వైపుకు వెళుతున్న ఇసుక లారీల తాకిడికి రోడ్డు ధ్వంసం అయింది. గతంలో స్థానికులు కూడా భారీ స్థాయిలో రాత్రి పగలు తరలి వెళ్తున్న ఇసుక వాహనాల వలన దుమ్ము ధూళితో వాహనదారులు గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. జమాల్ ఖాన్ సహాయంతో  ఈరోజు సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో జెకేసి ట్రస్ట్ సభ్యులు  నటరాజ్, అజీజ్, జావీద్, షాజహాన్ పాల్గొన్నారు.

Image 1

పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?

Posted On 2026-07-13 13:56:11

Readmore >
Image 1

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...

Posted On 2026-07-13 13:25:59

Readmore >
Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >