Posted on 2025-08-11 16:19:03
కాలనీ సమస్యల పై వినతి పత్రం అందజేత
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని.. మూడో డివిజన్ మహాలక్ష్మి నగర్ సాయి టవర్స్ కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను కలిశారు. కాలనీ లో రోడ్డు, డ్రైనేజీ, మంచి నీటి సమస్య పై వినతి పత్రం అందచేశారు. సమస్యల పై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. సాయి టవర్స్ కాలనీ సందర్శించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాగు నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీధి లైట్ల సాధ్యమైనంత తొందరగా ఏర్పాటు చేయిస్తామన్నారు. కమిషనర్ ను కలిసిన వారిలో సాయి టవర్స్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు మహేష్ , ప్రధాన కార్యదర్శి బాల్ రావు, సభ్యుడు బాల కుమార్ కలిశారు.
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >