Posted on 2025-08-12 07:25:40
డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ సోమవారం చనిపోయినట్లు ఆర్మీ అధికారులు ఫ్యామిలీ మెంబర్స్‌కు సమాచారం అందించారు. డ్యూటీలో భాగంగా ఆర్మీ ట్రక్‌లో పెట్రోలింగ్ కు వెళ్తుండగా, ప్రమాదవశాత్తు ట్రక్ లోయలో పడిపోవడంతో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్యతండాకు చెందిన అనిల్ కుమార్(30) గల్లంతయ్యాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆర్మీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, డెడ్‌బాడీ లభ్యమైంది.
సెలవులపై గ్రామానికి వచ్చిన అనిల్ కుమార్ 20 రోజుల కింద విధుల్లో చేరాడు. ఈ నెల10న తన బర్త్‌డే సందర్భంగా భార్య, ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడాడు. తోటి జవాన్లతో బర్త్‌డే జరుపుకున్న ఫొటోలను కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. ఇంతలోనే అనిల్‌కుమార్ చనిపోయినట్లు ఆర్మీ అధికారులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య రేణుక, 8 నెలల బాబు ఉన్నారు. అనిల్ మృతితో తండాలో విషాదం నెలకొంది.
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >