| Daily భారత్
Logo




పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి : వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

News

Posted on 2025-08-13 14:55:53

Share: Share


పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి : వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌  సన్‌ ప్రీత్‌ సింగ్‌

డైలీ భారత్, వరంగల్: పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్‌ అధికారులు పారదర్శకంగా న్యాయం అందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌  నల్లబెల్లి పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ బుధవారం నల్లబెల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు స్టేషన్‌ పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు.  అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ తో పాటు కిట్‌ ఆర్టికల్స్‌ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌, సిసిటిఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్‌ కమిషనర్‌ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ,డిసిలు, మిస్సింగ్‌, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సీపీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ, డీసీపీ చేతుల మీదుగా మొక్కలను ఈ తనిఖీల్లో ఈస్ట్ జోన్‌ డీసీపీ అంకిత్ కుమార్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుగ్గొండి సిఐ సాయి రమణ, నల్లబెల్లి, ఖానాపూర్ ఎస్‌.ఐలు గోవర్ధన్,  రఘుపతి పాల్గోన్నారు.

Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >