| Daily భారత్
Logo




కొత్తగూడెం నగరపాలక సంస్థ అధికారులు నిద్రమత్తు వీడాలి

News

Posted on 2025-08-13 15:32:26

Share: Share


కొత్తగూడెం నగరపాలక సంస్థ అధికారులు నిద్రమత్తు వీడాలి

పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలి

కొత్తగూడెం మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో అధికారులు పారిశుధ్యం పై దృష్టి సారించాలని తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ సుజాతను కలిసి వినతి పత్రం ఇచ్చారు. శానిటేషన్ అధికారులు నిద్రమత్తు విడాలని చెప్పారు. కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆవులు సంచరిస్తూ.. రోడ్లపై బైఠాయిస్తూ.. వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ లోపం కారణంగా దుర్గంధం వెదజల్లుతున్నాయని, పారిశుద్ధ్య అధికారుల పట్టింపు లేదని చెప్పారు. సీజనల్ వ్యాధుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పొగను మరియు దోమల మందు పిచికారి చేయాలన్నారు. గతంలో నిధులు మంజూరై ప్రారంభమైన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇంజనీరింగ్ విభాగ అధికారులు పెండింగ్ పనుల పై దృష్టి పెట్టాలని, పెండింగ్ పనులను ఆయా కాంట్రాక్టర్లు పూర్తి చేయాలన్నారు. డివైడర్ మధ్యలో పెరిగిన కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని, శానిటేషన్ కార్మికులకు వెంటనే రైన్  కోట్లు అందించాలి, సంటేషన్ కార్మికులకు అందవలసిన సబ్బులు నూనెలను వెంటనే అందించాలి. కోతులు, కుక్కల వెంటనే పట్టించి వాటి బెడద నుంచి నగర ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >