| Daily భారత్
Logo




రామడుగు ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి

News

Posted on 2025-08-13 16:37:39

Share: Share


రామడుగు ప్రాజెక్టు  నీటిని విడుదల చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి

42 శాతం బీసీ రిజర్వేషన్ కు బిజెపి ఎంపీలు అనుకూలమా...? వ్యతిరేకమా...?

-ప్రజల ముందే వారి వైఖరిని స్పష్టం చేయాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ధర్పల్లి మండలం లోని రామడుగు  గ్రామ శివారులో ఉన్న  రామడుగు  ప్రాజెక్టుకు సంబంధించిన కుడి ఎడమల కాలువల నుంచి  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  నీళ్లను విడుదల చేశారు. రామడుగు ప్రాజెక్టు కట్టమీద ఉన్న కట్ట మైసమ్మ కి పూజ చేసి, అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రామడుగు ప్రాజెక్టు నుండి  వివిధ గ్రామాలకు ఆయకట్టు ద్వారా  నీళ్లు వెలుతాయని అన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు క్రింద ఉన్న  పంట పొలాలు ఎండి పోతున్న యని రైతులు రూరల్ ఎమ్మెల్యే కు విన్నవించుకోవడంతో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి,ఆయకట్టు పంట పొలాలకు బుధవారం  సాగునీటిని  విడుదల చేయడం జరిగిందని అన్నారు. సుద్దులం, రామడుగు, మైలారం, కోరట్పల్లి, కలి గౌడ్ చింతలూరు మనోహరాబాద్, వంటి గ్రామాల పంట పొలాలకు నీరు చేరుతుందని అన్నారు. రైతులను రాజు చేయడమే ప్రభుత్వ లక్షమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి పథకాలను అమలు చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని అన్నారు, అలాగే 42 శాతం బీసీ రిజర్వేషన్ కు టిఆర్ఎస్ బిజెపి నాయకులు  వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజాంబాద్ ఎంపీ అరవింద్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లు బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకామా...? అనుకూలమా..? చెప్పాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ కొరకు రాజ్యాంగంలో  9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవాలని అన్నారు. లేకపోతే బిజెపి ఎంపీలను  గ్రామాల్లో తిరగకుండా బీసీ ప్రజలు తరిమి కొడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, డిష్పల్లి మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారులు, ధర్పల్లి మండల తహసిల్దార్ శాంత, ఎంపీడీవో, రామడుగు వీడీసీ చైర్మన్ రాజారెడ్డి, సుద్దులం విడిసి చైర్మన్ సాయి రెడ్డి, రాముడు గ్రామ శాఖ అధ్యక్షులు ఆనంద్,సుద్దులం గ్రామ శాఖ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >