Posted on 2025-08-14 08:34:58
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎం ఎల్ ఏ ధన్ పాల్ సూర్యనారాయణ ప్రజలందరికీ ముఖ్య సూచనలు జారీ చేశారు. ఇటీవల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీటి నిల్వలు,మలిన వాతావరణం వంటి కారణాల వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
పరిసర ప్రాంతాలలో నీటినిల్వ వ్యర్థలను తొలగించాలని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా, మురుగునీటి కాలువలు, విద్యుత్ స్తంభాలు, తీగల వంటి ప్రదేశాలలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిన్న పిల్లలు బయటికి వెళ్తున్న సమయంలో తల్లిదండ్రులు వారిని గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మున్సిపల్ శాఖ మరియు విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకర ప్రదేశాలలో హెచ్చరికల బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని, వాటిపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >