Posted on 2025-08-14 13:20:16
జాడ లేని ట్రాఫిక్ పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని చంద్రశేఖర్ కాలనీ లో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పి ఎస్) ఎదుట ప్రతిరోజు స్కూల్ ప్రారంభం అయ్యే సమయం, స్కూల్ మూసే సమయంలో విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అయినా ఇటువైపు ట్రాఫిక్ పోలీసులు కన్నెత్తి కూడా చూడకుండా ట్రాఫిక్ క్లియర్ చేయడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కారణం పాఠశాల యాజమాన్యం అర్బన్ ఎమ్మెల్యే కు బాగా తెలిసిన వారు కావడం ఓకేత్తు అయితే, ఇందులో చదివే విద్యార్థులు నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఎస్సైల నుండి సిఐల పిల్లలు కూడా ఈ పాఠశాలలోనే చదువుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ పాఠశాల దరిదాపులోకి వచ్చే సాహసం చేయలేకపోవడం విశేషం. దీంతో ట్రాఫిక్ జామ్ వల్ల ఈ రోడ్డు గుండా ప్రయాణించే సామాన్య ద్విచక్ర వాహన దారులు ఇబ్బందులకు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >