| Daily భారత్
Logo




బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురేసిన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి

News

Posted on 2025-08-15 11:38:21

Share: Share


బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురేసిన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను  పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి జాతీయ పతకాన్ని ఎగురవేశారు.  ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలకు జీవన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరాయిపాలకుల చెర వీడి దేశం స్వేచ్ఛా వాయువులు పేల్చేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర సమరయోధుల త్యాగ నిరతిని జీవన్ రెడ్డి కొనియాడారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మాజీ జడ్పీటీసీ లు   బాజిరెడ్డి జగన్, మెట్టు సంతోష్,  ప్రభాకర్, వైశాలిని రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి,పూజ నరేందర్, అభిలాష్, తెలంగాణ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జీవన్ రెడ్డి 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.


ఇదిలావుండగా అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న గొట్టుముక్కల గంగాధర్ ను జీవన్ రెడ్డి పరామర్శించా రు. ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని  విజ్ఞప్తి చేశారు.

Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >